Andhra Pradesh: నిన్నటి ఘటనపై క్రిమినల్ కేసు పెట్టండి: మార్షల్స్ కు ఏపీ స్పీకర్ తమ్మినేని ఆదేశం

  • నిన్న అసెంబ్లీలోకి కొత్తవారు
  • గుర్తించేందుకు పోలీసుల సాయం తీసుకోండి
  • మార్షల్స్ కు తమ్మినేని డైరెక్షన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో నిన్న జరిగిన ఘటనలపై క్రిమినల్ కేసులు పెట్టాలని మార్షల్స్ ను స్పీకర్ తమ్మినేని ఆదేశించారు. నిన్న చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలతో పాటు బయటివారు కూడా ఉన్నారన్న విషయం వీడియోల్లో స్పష్టమైందన్న తమ్మినేని, వారిని గుర్తించేందుకు పోలీసుల సాయం తీసుకోవాలని సూచించారు. నిన్నటి ఘటనలు అత్యంత దురదృష్టకరమైనవని, అసెంబ్లీ రక్షణ నిమిత్తం నియమించబడిన మార్షల్స్ తో దురుసుగా ప్రవర్తించడం క్షమార్హం కాదని స్పష్టం చేశారు. క్రిమినల్ కేసు పెట్టాలని తాను సభ నుంచి మార్షల్స్ కు ఆదేశాలు జారీ చేస్తున్నానని అన్నారు. తనకు ఎవరిపైనా దురభిప్రాయం లేదని తెలిపారు.

Andhra Pradesh
Assembly
Marshals
Criminal Case
Police
  • Loading...

More Telugu News