Time: డొనాల్డ్ ట్రంప్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన గ్రెటా థన్ బర్గ్!

- టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా గ్రెటా
- ట్విట్టర్ లో మండిపడిన ట్రంప్
- దీటుగా స్పందించిన గ్రెటా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకోగా, యువ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఇటీవల గ్రెటాను 'టైమ్' మేగజైన్, 2019 సంవత్సరానికిగాను 'పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ తనలోని అక్కసును ప్రదర్శిస్తూ, ఓ ట్వీట్ పెట్టారు. టైమ్ పత్రిక తెలివి తక్కువ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు.
ఆపై గ్రెటా తన కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడం ఎలాగన్న విషయమై దృష్టిని సారించాలని సూచించాడు. తన స్నేహితునితో కలిసి ఓ మంచి సినిమాకు వెళ్లాలని చెబుతూ 'చిల్ గ్రెటా చిల్!' అని ట్వీట్ చేశారు.
