CAB: కేరళ బాటలో పంజాబ్... పౌరసత్వ బిల్లును అమలు చేయబోమంటున్న రాష్ట్రాలు!

  • రాష్ట్రాల నుంచి మొదలైన వ్యతిరేకత
  • బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్న పినరయి విజయన్
  • అమలు చేయకుండా చట్టం తెస్తామన్న అమరీందర్ సింగ్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు ఇప్పుడు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, దీన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోవడం లేదని కేరళ స్పష్టం చేసింది. బిల్లులో ఎన్నో లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన రాష్ట్ర సీఎం పినరయి విజయన్, బిల్లును అమలు చేస్తే అశాంతి పెరుగుతుందని అన్నారు.

ఇక కేరళ దారిలోనే పంజాబ్ కూడా బిల్లును అమలు చేయబోమని తేల్చి చెప్పింది. పౌరసత్వ బిల్లును ఆది నుంచి వ్యతిరేకిస్తున్న పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, ఇండియాలో దశాబ్దాలుగా ఉన్న లక్షలాది మందికి బిల్లు అనుకూలం కాదని అన్నారు. బిల్లును అమలు చేయబోమని అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయనున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News