Mutyala Ratnam: టీడీపీకి మరో నేత గుడ్‌బై.. 14న జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న ముత్యాల రత్నం?

  • మంత్రి పేర్ని నానితో రత్నంకు మంచి సంబంధాలు
  • ఇప్పటికే వైసీపీలో చేరాలంటూ నేతల ఆహ్వానం
  • జగన్ సమక్షంలో చేరిక?

ఏలూరు టీడీపీ నేత, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్యాల రత్నం త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మంత్రి పేర్ని నానికి, రత్నం కుటుంబానికి మంచి సంబంధాలు ఉండడం, ఉండి నియోజకవర్గంతోపాటు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలపై మంచి పట్టు ఉండడంతో ఆయనను పార్టీలోకి రావాలంటూ వైసీపీ నేతలు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ నెల 14న ముఖ్యమంత్రి జగన్ ఏలూరులో పర్యటించాల్సి ఉంది. ఈ సందర్భంగా రత్నంతోపాటు మరికొందరు నేతలు ఆయన సమక్షంలో వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే, జగన్ పర్యటన ఆ తర్వాత రద్దు కావడంతో నేరుగా సీఎం క్యాంపు కార్యాలయంలోనే చేరికలు ఉంటాయని చెబుతున్నారు.  

Mutyala Ratnam
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News