Central Home Minister: అమిత్ షాను కలిసిన ఏపీ బీజేపీ నేతలు..వైసీపీ దాడులపై ఫిర్యాదు

  • అమిత్ షాను కలిసిన రమేశ్ నాయుడు, కిలారు దిలీప్
  • ఉపరాష్ట్రపతిపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపైనా ఫిర్యాదు
  • అమిత్ షా సానుకూలంగా స్పందించారన్న నేతలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఏపీ బీజేపీ నేతలు ఈ రోజు కలిశారు. ఏపీలో విపక్షనేతలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అమిత్ షాను కలిసిన వారిలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ నాయుడు, కిలారు దిలీప్ ఉన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై సీఎం జగన్ విమర్శలు చేసిన అంశాన్ని ఆయన దృష్టికి తెచ్చామని, ఈ విషయమై అమిత్ షా సానుకూలంగా స్పందించారని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని బీజేపీ నేతలు చెప్పారు.

Central Home Minister
Amith shah
YSRCP
BJP
  • Loading...

More Telugu News