Assam: పౌరసత్వ సవరణ బిల్లుపై త్రిపుర, అసోంలో నిరసనలు!

  • అసోం రైఫిల్స్ ను రంగంలోకి దింపిన ప్రభుత్వం
  • గువాహటి, తిన్సుకియా, దిబ్రూగఢ్ లో సైన్యం మోహరింపు
  • గువాహటి నుంచి బయలుదేరాల్సిన పలు విమానాల రద్దు

జాతీయ పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ త్రిపుర, అసోం రాష్ట్రాలలో నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. అసోం రైఫిల్స్ ను ప్రభుత్వం రంగంలోకి దింపింది. గువాహటి, తిన్సుకియా, దిబ్రూగఢ్ జిల్లాల్లో సైన్యాన్ని మోహరించారు. నిరసనల కారణంగా గువాహటి నుంచి బయలుదేరాల్సిన 13 విమానాలు రద్దయ్యాయి. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. దిబ్రూగఢ్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

Assam
Tripura
Assam Rifiles
Gowhati
  • Loading...

More Telugu News