Vallabhaneni Vamsi: టీడీపీ వరుసలో కూర్చొని అంబటికి స్లిప్పులు రాసి పంపించిన వల్లభనేని వంశీ

  • ప్రత్యేక సభ్యుడిగా గుర్తించినప్పటికీ టీడీపీ వరుసలోనే కూర్చున్న వంశీ
  • పలు మార్లు అంబటికి స్లిప్పులు రాసి పంపిన వైనం
  • మరోసారి చర్చనీయాంశంగా మారిన వంశీ తీరు

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శాసనసభలో వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని ప్రకటించిన సంగతి తెలిసిందే. సభలో ఆయనకు ఇష్టం ఉన్న చోట కూర్చోవచ్చని ఆయన తెలిపారు.

అయినప్పటికీ ఈ నాటి సభలో వంశీ టీడీపీ వరుసలోనే కూర్చున్నారు. అయితే, 2430 జీవో, మీడియాపై ఆంక్షలు అంశంపై సభలో హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వంశీ స్లిప్పులు రాసి పంపించారు. పలు అంశాలపై ఆయన స్లిప్పులు పంపించడం చర్చనీయాంశంగా మారింది.

Vallabhaneni Vamsi
Telugudesam
Ambati Rambabu
YSRCP
  • Loading...

More Telugu News