anam ramnarayanareddy: వైఎస్‌ హయాంలో అలా జరగలేదు...చంద్రబాబు ఆరోపణలు తప్పు: ఆనం

  • అప్పటి ఎథిక్స్‌ కమిటీ ఏం తేల్చిందో చూడాలి
  • సభలో సీఎం జగన్‌పై బాబు ఆరోపణలు సరికాదు
  • ఈ విషయంలో ఎథిక్స్‌ కమిటీ వేయాలి

వైఎస్సార్‌ హయాంలో తన చాంబర్‌ అద్దాలు పగులగొట్టారంటూ విపక్ష నాయకుడు చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అప్పటి ప్రభుత్వంలో మంత్రి, ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అయిన ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వైఎస్‌ హయాంలో కూడా తన చాంబర్‌ అద్దాలు పగలగొట్టారని ఈరోజు అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు చేసిన ఆరోపణలపై ఆనం స్పందించారు.

ఆరోజు జరిగిన ఘటనపై ఏర్పాటు చేసిన ఎథిక్స్‌ కమిటీ ఏం చెప్పిందో చంద్రబాబు ఒకసారి చూసుకోవాలన్నారు. అప్పటి సీఎంను కలిసేందుకు వెళ్తున్న వారిని మార్షల్స్‌ అడ్డుకున్నారని మాత్రమే చెప్పారని గుర్తు చేశారు. ఈనాటి ముఖ్యమంత్రి జగన్‌పై చంద్రబాబు తీరు సరికాదని, తన అనుచిత వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోవాలని కోరారు. సభా వ్యవహారాపై ఎథిక్స్‌ కమిటీ వేయాలని ఈ సందర్భంగా ఆనం స్పీకర్‌ తమ్మినేనిని కోరారు.

anam ramnarayanareddy
Chandrababu
  • Loading...

More Telugu News