Adinarayana Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని విచారిస్తున్న సిట్!

  • ఈ ఉదయం కడపకు వచ్చిన ఆదినారాయణ రెడ్డి
  • విచారిస్తున్న సిట్ అధికారులు
  • వివేకా పీఏ కృష్ణారెడ్డి కూడా హాజరు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. నిన్న ఉదయం సిట్ అధికారుల నోటీసులు అందుకున్న ఆదినారాయణ రెడ్డి, ఈ ఉదయం కడపలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.

ఆపై ఆయన్ను లోనికి తీసుకెళ్లిన అధికారులు, ప్రస్తుతం విచారిస్తున్నారు. ఆయనతో పాటు వివేకా వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డిని కూడా విచారిస్తున్నారు. ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి, తమకున్న అనుమానాలను నెరవేర్చుకునే పనిలో అధికారులు ఉన్నారని తెలుస్తోంది. ఆదినారాయణ రెడ్డి విచారణపై మరిన్ని విషయాలు తెలియాల్సివుంది. 

Adinarayana Reddy
YS Viveka
Murder
Sit
Enquiry
  • Loading...

More Telugu News