adb: ఈ ఏడు మరింతగా తగ్గనున్న భారత వృద్ధి రేటు: హెచ్చరించిన ఏడీబీ

  • 2019-20లో 5.1 శాతమే
  • ఆ తరువాతి సంవత్సరంలో 6 శాతం వరకూ
  • తాజా అంచనాలు వెల్లడించిన ఏడీబీ

ఈ సంవత్సరం భారత వృద్ధి రేటు మరింతగా తగ్గుతుందని ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ హెచ్చరించింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2019లో 5.1 శాతంగా ఉండవచ్చని తన తాజా రిపోర్టులో వెల్లడించింది. తదుపరి 2020-2021 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6 శాతం వరకూ ఉండవచ్చని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా సత్ఫలితాలు రావచ్చని, అందువల్లే 2020 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పెరుగుతుందని అంచనా వేస్తున్నామని బ్యాంక్ తన అవుట్ లుక్ లో అభిప్రాయపడింది.

వాస్తవానికి 2019లో ఏడీబీ అంచనాలు వేసిన సమయంలో భారత వృద్ధి 7 శాతం వరకూ ఉంటుందని వెల్లడైంది. అయితే, ఆర్థిక మాంద్యం, మారిన పరిస్థితుల నేపథ్యంలో తొలుత 6 శాతానికి, ఆపై దాన్ని తాజాగా 5.1  శాతానికి కుదించింది. 2020 ఆర్థిక సంవత్సరంలో తొలుత అంచనా వృద్ధి రేటు 7 శాతం కాగా, దాన్ని 6 శాతానికి తగ్గించడం గమనార్హం.

  • Loading...

More Telugu News