Pawan Kalyan: పవన్ కల్యాణ్ దీక్షకు డుమ్మా కొట్టిన ఏకైక జనసేన ఎమ్మెల్యే!

  • మొదలైన పవన్ దీక్ష
  • హాజరుకాని రాపాక వరప్రసాద్
  • ఇటీవలి కాలంలో జనసేనకు దూరంగా రాపాక

ఈ ఉదయం నుంచి 'రైతు సౌభాగ్య దీక్ష' పేరిట జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, కాకినాడలో దీక్ష చేపట్టగా, ఆ పార్టీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. పార్టీ అధినేత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దీక్షకు రాపాక హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.

 కాగా, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన రాలేదని పార్టీ నేతలు కొందరు వ్యాఖ్యానించగా, ఇటీవలి కాలంలో రాపాక పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం లేదన్న సంగతి తెలిసిందే. ఆయన వైసీపీ నేతలకు దగ్గరగా మసలుతున్నారని, త్వరలోనే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి.  'రైతు సౌభాగ్య దీక్ష'కు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే రాపాక స్పందించాల్సి వుంది.

Pawan Kalyan
Rapaka
Protest
Kakinada
  • Loading...

More Telugu News