Maharashtra: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ మహారాష్ట్ర ఐపీఎస్ అధికారి రాజీనామా
- పౌరసత్వ సవరణ బిల్లుకు ఉభయ సభలూ ఆమోదం
- తీవ్రంగా వ్యతిరేకించిన అబ్దుర్ రహమాన్
- శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా నేటి నుంచి విధులకు హాజరుకాబోవడం లేదని వివరణ
ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. దీంతో భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన మూడు దేశాల ముస్లిమేతరులకు భారత పౌరసత్వం లభించనుంది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు మండిపడుతుండగా, తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ ఐపీఎస్ అధికారి అబ్దుర్ రహమాన్ ఈ చట్టాన్ని నిరసిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉభయ సభల్లోనూ ఈ బిల్లుకు ఆమోదం లభించినప్పటికీ ఇది పూర్తిగా మతతత్వ పూరితమని, రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా నేటి నుంచి విధులకు హాజరు కాబోవడం లేదన్నారు. మరోవైపు, పౌరసత్వ బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని జమాతే ఇస్లామీ హింద్ ప్రకటించింది. కాగా, తన ఉద్యోగానికి రాజీనామా చేసిన రహమాన్ ముంబైలో స్పెషల్ ఐజీగా పనిచేస్తున్నారు.