Ashok Gajapati Raju: అశోక్ గజపతిరాజుకు శస్త్రచికిత్స... పరామర్శించిన జేపీ!

  • తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడిన గజపతిరాజు
  • విజయనగరంలోని ఇంటికి వచ్చిన జయప్రకాశ్ నారాయణ
  • కుటుంబీకులతో కలిసి అక్కడే మధ్యాహ్న భోజనం

తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతూ, ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న తెలుగుదేశం పార్టీ నేత, విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పరామర్శించారు. చింతవలసలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చిన ఆయన, అక్కడి నుంచి విజయనగరంలోని గజపతిరాజు నివాసానికి వెళ్లారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ జరిగిన విధానంపైనా, ప్రస్తుతం తీసుకుంటున్న వైద్యం పైనా వివరాలు అడిగారు. ఆపై ఆయన ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

Ashok Gajapati Raju
Operation
Jayaprakash Narayan
  • Loading...

More Telugu News