ts rtc bus: కోరుట్ల నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సుపై అర్ధరాత్రి దాడి

  • జగిత్యాల వద్ద దాడి
  • కారులో వచ్చిన దుండగులు
  • గాలిస్తున్న పోలీసులు

కోరుట్ల నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సుపై కొందరు గుర్తు తెలియని దుండగులు గత అర్ధ రాత్రి దాడికి దిగారు. గత రాత్రి తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి హైదరాబాద్‌కు బస్సు బయలుదేరింది. అర్ధ రాత్రి ఒంటి గంట సమయంలో బస్సు జగిత్యాలకు చేరుకుంది.

ఆ సమయంలో కారులో వచ్చిన ఆరుగురు వ్యక్తులు బస్సుపై దాడిచేసి అద్దాలు పగలగొట్టారు. దాడి జరిగిన సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో ఎవరికీ ఎటువంటి గాయాలూ కాలేదు. ఘటనపై బస్సు డ్రైవర్ జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వేరే బస్సులో ప్రయాణికులను హైదరాబాద్ కు తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ts rtc bus
attack
korutla
Hyderabad
  • Loading...

More Telugu News