Pawan Kalyan: మరికాసేపట్లో ప్రారంభం కానున్న పవన్ కల్యాణ్ ‘రైతు సౌభాగ్య దీక్ష’

  • కాకినాడ జేఎన్‌టీయూ ఎదురుగా ఉన్న మైదానంలో దీక్ష
  • రైతులకు గిట్టబాటు ధర కల్పించాలని డిమాండ్
  • నాదెండ్ల మనోహర్, నాగబాబుతో కలిసి దీక్ష వేదిక వద్దకు పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కాకినాడలో రైతులకు మద్దతుగా ‘రైతు సౌభాగ్య దీక్ష’ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని జేఎన్‌టీయూ ఎదురుగా ఉన్న మైదానంలో పవన్ దీక్షకు కూర్చోనున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని,  మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలనేది పవన్ ప్రధాన డిమాండ్. పవన్ మరికాసేపట్లో నాదెండ్ల మనోహర్, నాగబాబులతో కలిసి జీఆర్‌టీ హోటల్ నుంచి దీక్ష చేపట్టనున్న ప్రాంగణానికి చేరుకుంటారు. 8 గంటలకు దీక్ష ప్రారంభిస్తారు.  

Pawan Kalyan
kakinada
Rythu Soubhagya Deeksha
  • Loading...

More Telugu News