siddaramaiah: చాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య

  • ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు 
  • ఐసీయూలో ఉంచి చికిత్స
  • నేటి మధ్యాహ్నం డిశ్చార్జ్

కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (71) ఛాతీ నొప్పితో నిన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు సిద్ధరామయ్య గుండెకు రక్తం సరిగా సరఫరా కావడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సిద్ధరామయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, భయపడాల్సిందేమీ లేదని వైద్యులు తెలిపారు.

తన తండ్రి గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్టు సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర మీడియాకు తెలియజేశారు. సిద్ధరామయ్య నేటి మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.  

siddaramaiah
Karnataka
Hospital
health
  • Loading...

More Telugu News