India: చివరి టీ20లో భారత్ ఘనవిజయం... సిరీస్ కైవసం

  • టీమిండియా 240/3
  • లక్ష్యఛేదనలో విండీస్ స్కోరు 173/8
  • రాణించిన భారత బౌలర్లు

వెస్టిండీస్ తో మూడు టీ20ల సిరీస్ ను టీమిండియా 2-1తో చేజిక్కించుకుంది. ముంబయిలో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో భారత్ 67 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 241 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యఛేదనలో వెస్టిండియన్లు చివరికి 8 వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేశారు. ఆ జట్టులో కెప్టెన్ పొలార్డ్ 68 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. షిమ్రోన్ హెట్మెయర్ 41 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో విండీస్ కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో చహర్, భువీ, షమీ, కుల్దీప్ తలో 2 వికెట్లతో రాణించారు.

అంతకుముందు టీమిండియా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (34 బంతుల్లో 71), కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 91), కెప్టెన్ కోహ్లీ (29 బంతుల్లో 70 నాటౌట్) అదరగొట్టారు. దాంతో టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇక ఇరు జట్ల జధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఈ నెల 15న చెన్నైలో జరగనుంది.

India
West Indies
Mumbai
Wankhede
T20
  • Loading...

More Telugu News