India: టి20: ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయిన విండీస్

  • విండీస్ లక్ష్యం 241
  • ప్రస్తుతం స్కోరు 7 ఓవర్లలో 3 వికెట్లకు 60
  • రాణించిన భారత బౌలర్లు

వాంఖెడే మైదానంలో టీమిండియాతో జరుగుతున్న చివరి టి20 మ్యాచ్ లో వెస్టిండీస్ కష్టాల్లో పడింది. 241 పరుగుల భారీ లక్ష్యఛేదనలో విండీస్ 17 పరుగులకే 3 కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (5), లెండిల్ సిమ్మన్స్ (7)తో పాటు నికోలాస్ పూరన్ (0) స్వల్ప స్కోర్లకే అవుటయ్యారు. దాంతో జట్టును ఆదుకునే బాధ్యతను కెప్టెన్ కీరన్ పొలార్డ్ (16 బ్యాటింగ్), షిమ్రోన్ హెట్మెయర్ (26 బ్యాటింగ్) స్వీకరించారు. ప్రస్తుతం వెస్టిండీస్ స్కోరు 7 ఓవర్లలో 3 వికెట్లకు 60 పరుగులు. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 13 ఓవర్లలో 181 పరుగులు చేయాలి. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, దీపక్ చహర్ తలో వికెట్ పడగొట్టారు.

India
West Indies
Mumbai
Wankhede
  • Loading...

More Telugu News