Disha: దిశను దహనం చేసిన ప్రదేశాన్ని ఫొటోలు తీసిన న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు

  • సంచలనం సృష్టించిన దిశ ఘటన
  • ఘటనకు విశేష ప్రాధాన్యం ఇచ్చిన అంతర్జాతీయ మీడియా
  • చటాన్ పల్లి వచ్చిన న్యూయార్క్ టైమ్స్ పాత్రికేయుడు

కొన్నివారాల కిందట సంచలనం సృష్టించిన దిశ ఘటన అంతర్జాతీయ మీడియాలోనూ మార్మోగింది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ మీడియా సంస్థ దిశ ఘటనపై ప్రత్యేక కవరేజీ ఇస్తోంది. తాజాగా, న్యూయార్క్ టైమ్స్ దక్షిణాసియా విభాగం బ్యూరో చీఫ్ జెఫ్రీ జెటిల్మన్ చటాన్ పల్లి వద్ద దిశను దహనం చేసిన ప్రదేశాన్ని సందర్శించారు.

జెఫ్రీతో పాటు వచ్చిన మహిళా ఫొటోగ్రాఫర్ సంఘటన స్థలాన్ని వివిధ కోణాల్లో ఫొటోలు తీశారు. ఆ తర్వాత వారు దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. అక్కడ కొన్ని ఫొటోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జెఫ్రీ మాట్లాడుతూ, న్యూయార్క్ టైమ్స్ దక్షిణాసియా విభాగం ఢిల్లీ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోందని, దిశ ఘటన గురించి తెలుసుకుని తమ పాఠకులకు మరింత సమాచారం అందించేందుకు వచ్చామని తెలిపారు.

Disha
Hyderabad
Telangana
Newyork Times
Jeffrey Gettleman
  • Loading...

More Telugu News