Assam: అసోంలో సెగలు పొగలు... పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఎఫెక్ట్!

  • లోక్ సభ ఆమోదం పొందిన చట్టసవరణ బిల్లు
  • అసోంలో పెద్ద ఎత్తున నిరసనలు
  • ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన ప్రభుత్వం
  • అసోంకు భద్రతా బలగాల తరలింపు

లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న సమయంలో అసోంలో నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. అనేక జిల్లాల్లో నిరసనలు హింసాత్మక రూపు దాల్చాయి. పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. గువాహటిలో కర్ఫ్యూ విధించారు.

10 జిల్లాల్లో బుధవారం రాత్రి 7 గంటల నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని సోషల్ మీడియా గ్రూపులు అలజడి రేకెత్తించే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఆ ప్రకటనలో వెల్లడించింది. శాంతిభద్రతలు అదుపు తప్పుతుండడంతో భద్రతా బలగాలను రంగంలోకి దించుతున్నారు. జమ్మూకశ్మీర్ నుంచి సైన్యాన్ని అసోంకు తరలిస్తున్నారు.

Assam
Guwahati
Army
  • Loading...

More Telugu News