Anand Mahindra: విస్మయం కలిగించే మరో వీడియో పోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా

  • 72 ఏళ్ల వయసులో బామ్మ గారి వెయిట్ లిఫ్టింగ్
  • జిమ్ లో వృద్ధురాలి సందడి
  • స్పందించిన ఆనంద్ మహీంద్రా

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఉబుసుపోని ట్వీట్లతో కాలక్షేపం చేయకుండా, ఏదో ఒక సందేశం, పరమార్థం ఉండే పోస్టులతో ఆయన అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు.

 తాజాగా ఓ ఆసక్తి కలిగించే వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. నాంది ఫౌండేషన్ సీఈఓ మనోజ్ కుమార్ పోస్టు చేసిన వీడియోను ఆయన రీట్వీట్ చేశారు. ఆ వీడియోలో 72 ఏళ్ల వయసున్న వృద్ధురాలు జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తోంది. సన్నగా రివటలా ఉన్న ఆ బామ్మ వయసును ధిక్కరించేలా శరీర దారుఢ్యాన్ని ప్రదర్శించడం పట్ల ఆనంద్ మహీంద్రా అచ్చెరువొందారు.

ఈ వీడియోను చూస్తుంటే మరింత ఎక్కువ సేపు వ్యాయామాలు, యోగా చేయాలనిపిస్తోందని కామెంట్ చేశారు. ఆ వృద్ధురాలిని ఉక్కు మహిళగా అభివర్ణించిన మహీంద్రా, ఆమెను చూస్తుంటే తనను తాను మార్చుకోవాలనిపిస్తోందని, వ్యాయామం చేసేందుకు సాకులు చెప్పడాన్ని ఆపాలనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ వీడియోలోని మహిళ పేరు లారెన్ బ్రజోన్. అమెరికాలోని నోర్వాక్ సిటీలో నివసిస్తోంది. అక్కడి జిమ్ లలో ఆమె అందరికీ సుపరిచితురాలే. యువతీయువకులకు దీటుగా ఆమె చేసే విన్యాసాలు, ఎక్సర్ సైజులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.

Anand Mahindra
Lauren Bruzzone
USA
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News