Telugudesam: టీడీపీ హయాంలో అర్జీ సమర్పిస్తే బుట్టలో వేసేవారు: చెవిరెడ్డి భాస్కరరెడ్డి

  • మరి, ఈరోజున అర్జీ పెట్టిన వాళ్లింటికి వెళ్లి సమాధానం చెబుతున్నాం
  • ‘స్పందన’కు అర్జీ సమర్పించే వ్యక్తే లేని విధంగా చేస్తాం
  • గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని జగన్ తెచ్చారు 

‘స్పందన’ కార్యక్రమం ప్రవేశపెట్టిన తొలినాళ్లలో రోజుకు రెండు వందల యాభై నుంచి మూడువందల వరకు ప్రజల నుంచి అర్జీలు వచ్చేవని, ఈరోజున వాటి సంఖ్య డెబ్బైకు తగ్గిందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, మరో ఆరు నెలల్లో ‘స్పందన’కు అర్జీ సమర్పించే వ్యక్తే లేని విధంగా చేస్తామని చెప్పారు.

 టీడీపీ హయాంలో అర్జీ సమర్పిస్తే బుట్టలో వేసేవారని, ఈరోజున ఎవరైతే అర్జీ పెట్టారో వాళ్లింటికి వెళ్లి సమాధానం చెబుతున్నామని అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని జగన్ తీసుకొచ్చారని ప్రశంసించారు. ఈరోజున పేదలు లంచాలు ఇవ్వకుండా తమ సమస్యలను పరిష్కరించుకుంటున్నారని, సుమారు ఆరు నెలల్లో నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగాలిచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదని అన్నారు.

  • Loading...

More Telugu News