Pawan Kalyan: పవన్ కల్యాణ్ కాకినాడ దీక్షకు సంబంధించిన పోస్టర్ విడుదల

  • రేపు కాకినాడలో రైతు సౌభ్యాగ దీక్ష
  • రైతుల సమస్యలపై జనసేనాని ఒక్కరోజు పోరాటం
  • రైతుల కడగండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకేనని పవన్ వెల్లడి

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రైతుల సమస్యలపై తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో చేపడుతున్న దీక్షకు రైతు సౌభాగ్య దీక్ష అని పేరు పెట్టారు. ఈ మేరకు జనసేన కార్యాలయంలో పోస్టర్ రిలీజ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వరకు తీసుకెళ్లేందుకు తాను దీక్ష చేస్తున్నానని, ఈ నెల 12న కాకినాడలో ఒకరోజు ఈ రైతు సౌభ్యాగ దీక్ష సాగుతుందని వెల్లడించారు.

పోస్టర్ విడుదల సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, వరి సాగు చేయాలంటే రైతులే జంకే పరిస్థితి నెలకొందని, అందుకు కారణం ప్రభుత్వ విధానాలేనని ఆరోపించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక, కనీసం ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఏపీని అన్నపూర్ణ అనేవాళ్లని, ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదని అన్నారు. కాకినాడ జేఎన్ టీయూ ఎదురుగా ఐటీఐ పక్కనే ఉన్న స్థలంలో పవన్ దీక్ష వేదిక ఏర్పాటు చేశారు.

Pawan Kalyan
Kakinada
East Godavari District
Raithu Sowbhagya Deeksha
Jana Sena
  • Loading...

More Telugu News