Jagan: జగన్ ఎదురైతే అభినందిస్తా... చంద్రబాబు ఏమన్నా పట్టించుకోను: జేసీ వ్యాఖ్యలు

  • అమరావతిలో మీడియాతో మాట్లాడిన జేసీ
  • జగన్ కు హ్యాట్సాఫ్ అంటూ వ్యాఖ్యలు
  • చంద్రబాబుకు అంత ధైర్యం లేదని వెల్లడి

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ గుండె ధైర్యం ఉన్న నాయకుడని కితాబిచ్చారు. తాను చేయాలనుకున్నది చేసే నేత అని జగన్ ను అభివర్ణించారు. ఆరోగ్యశ్రీ విషయంలో జగన్ నిర్ణయానికి హ్యాట్సాఫ్ అంటూ తన అభిప్రాయం వెల్లడించారు. గతంలో కంటే మరెంతో మందికి ఉపయోగపడేలా ఆరోగ్యశ్రీని తీసుకువచ్చారని ప్రశంసించారు. జగన్ ఎదురైతే తప్పకుండా అభినందిస్తానని, ఈ విషయంలో చంద్రబాబు ఏమన్నా పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు.

చంద్రబాబు హయాంలో కమ్మవాళ్లు గోదావరి, కృష్ణాలో కలిసిపోయారని, కానీ జగన్ ఎన్నో నామినేటెడ్ పోస్టులను రెడ్లకు ఇచ్చాడని, అందుకు తాను మెచ్చుకుంటున్నానని జేసీ తెలిపారు. చంద్రబాబుకు ఈ తరహా తెగువ లేదని అభిప్రాయపడ్డారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Jagan
Chandrababu
JC Diwakar Reddy
YSRCP
Andhra Pradesh
Telugudesam
  • Loading...

More Telugu News