Naga Shaurya: 'అశ్వథ్థామ' రిలీజ్ డేట్ ఖరారు

  • 'అశ్వథ్థామ'గా నాగశౌర్య
  • దర్శకుడిగా రమణ తేజ పరిచయం
  • జనవరి 31వ తేదీన విడుదల  

యువ కథానాయకుల రేసులో వెనుకబడిపోకుండా నాగశౌర్య తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. వరుస సినిమాలను ఒప్పేసుకున్న ఆయన, వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. తన సొంత బ్యానర్లో నిర్మితమైన 'అశ్వథ్థామ' చిత్రం ద్వారా ముందుగా ఆయన ప్రేక్షకులను పలకరించనున్నాడు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ, కొత్త పోస్టర్ ను వదిలారు. జనవరి 31వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ .. అవినీతిపరులను నిలదీసే పాత్రలో నాగశౌర్య కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు.

Naga Shaurya
Mehreen
  • Loading...

More Telugu News