Pawan Kalyan: అందుకే ఇకపై తనను 'పవర్ స్టార్' అని పిలవొద్దని 'పావలా' పిలుపునిచ్చాడు: విజయసాయి రెడ్డి

  • సోషల్ మీడియాలో నెటిజన్ల సృజన అద్భుతం
  • వారు స్పందించే తీరు ఆశ్చర్యపడేలా ఉంటుంది
  • పావలాకు బెత్తం స్టార్ అని పేరు పెట్టారు
  • ఈ పేరు వైరల్ అయింది 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు  గుప్పించారు. అత్యాచారం చేసిన వారిని బెత్తంతో కొట్టాలని పవన్ అన్నట్లు ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్ల సృజన, స్పందించే తీరు ఆశ్చర్యపడేలా ఉంటుందని అన్నారు. 'పావలాకు బెత్తం స్టార్ అని పేరు పెట్టారు. వైరల్ అయిందీ పేరు. అందుకే అనుకుంటా ఇకపై తనను పవర్ స్టార్ అని పిలవొద్దని పిలుపునిచ్చాడు. ఆలోచనల్లో పరిపక్వత లేని వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడి పరువు గంగలో కలుపుకుంటున్నారు' అన్నారు.

చంద్రబాబుపై విమర్శలు..
హెరిటేజ్‌ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి స్పందించారు. 'ఏపీ డెయిరీ, విశాఖ డెయిరీలో పనిచేసిన వ్యక్తి హెరిటేజ్‌లో డెయిరీ డివిజన్ హెడ్ అని ఆ సంస్థ వెబ్ సైట్లో కనిపిస్తుంది. ప్రభుత్వ రంగ డెయిరీని చంద్రబాబు ఒక్కో కీలు విరిచి ఎలా కుప్పకూల్చాడో ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలి? ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి సారు వారి వ్యాపార విస్తరణలో' అని ట్వీట్ చేశారు.

'సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ పేరు మీద 13,500 కోట్లు అప్పులు తెచ్చి పసుపు-కుంకుమ, పప్పు బెల్లాలకు పంచిపెట్టాడు చంద్రబాబు నాయుడు. ఉల్లి ధరలు పెరిగినా, ఇంకేదైనా నిత్యావసర వస్తువు ధర ఎగిసి పడినా నిధుల కొరతతో కార్పొరేషన్ రంగంలోకి దిగలేని పరిస్థితి సృష్టించి వెళ్లాడు' అని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

Pawan Kalyan
Jana Sena
Vijay Sai Reddy
  • Error fetching data: Network response was not ok

More Telugu News