ashok gehlot: భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధిపొందడంలో నరేంద్రమోదీ దిట్ట : రాజస్థాన్ సీఎం గెహ్లాట్

  • గెలవడం ఆయనకు ముఖ్యం... అందుకోసం ఏ మార్గమైనా అనుసరిస్తారు 
  • గుజరాత్ ఎన్నికల్లో ఆయన చేసినది ఇదే 
  • రానున్న ఎన్నికల్లో వీటన్నిటికీ ప్రజలు చెక్ చెబుతారు

భావోద్వేగాలు రెచ్చగొట్టి లబ్ధి పొందడంలో ప్రధాని నరేంద్రమోదీ దిట్టని, అన్ని ఎన్నికల్లో ఆయన అనుసరిస్తున్న విధానం ఇదేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా విమర్శించారు. 'మోదీకి గెలవడం ముఖ్యం. అందుకు అనుసరిస్తున్న మార్గం విషయంలో ఆయనకు పట్టింపు లేదు' అని వ్యాఖ్యానించారు.

ఒక్క మోదీయే కాదు బీజేపీ నేతలందరి మార్గం ఇదే. అసత్యాలను ప్రచారంచేసి ప్రజల్ని అయోమయంలోకి నెట్టేయడం వారికి అలవాటన్నారు. కాంగ్రెస్ మాజీ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను గుజరాత్ ఎన్నికల్లో ఉపయోగించుకోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

ఆయన వ్యాఖ్యలని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుని ప్రజల్ని రెచ్చగొట్టారని, విజయాన్ని దక్కించుకున్నారని ఆరోపించారు. ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు గ్రహిస్తున్నారని, రానున్న ఎన్నికల నాటికి బీజేపీ నాయకుల గిమ్మిక్కులకు చరమ గీతం పాడడం ఖాయమన్నారు. మోదీ, అమిత్ షాలకు ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీయేనని స్పష్టం చేశారు.

ashok gehlot
Narendra Modi
Rajasthan
elections
  • Loading...

More Telugu News