Nayanatara: కన్యాకుమారి భగవతి ఆలయంలో వ్రతం ప్రారంభించిన నయనతార!

  • కొత్త చిత్రంలో అమ్మవారి పాత్ర పోషిస్తున్న నయనతార
  • షూటింగ్ ముగిసేంత వరకూ నయన్ దీక్ష
  • ప్రియుడితో కలిసి ఆలయానికి వచ్చిన విఘ్నేశ్

తన కొత్త చిత్రం 'మూక్కుత్తి అమ్మన్'లో అమ్మవారి పాత్రను పోషిస్తున్న హీరోయిన్ నయనతార ప్రత్యేక వ్రతాన్ని ప్రారంభించింది. తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ తో కలిసి కన్యాకుమారిలోని భగవతి ఆలయాన్ని సందర్శించిన ఆమె, పూజల అనంతరం వ్రతం ప్రారంభించింది. నయనతారకు సంప్రదాయ స్వాగతం పలికిన ఆలయ పూజారులు, అమ్మవారి దర్శనం చేయించారు.

సినిమా షూటింగ్ ముగిసేంత వరకూ నయనతార వ్రతం కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఆలయానికి వచ్చిన నయనతారను చూసేందుకు భక్తులు ఎగబడటంతో, సినిమా యూనిట్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని భక్తులను అదుపు చేశారు. ఆపై అక్కడి నుంచి వెళ్లిన నయనతార, విఘ్నేశ్ లు తిరుచెందూర్ చేరుకుని అక్కడి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Nayanatara
Kanyakumari
Bhagavathi Amman
  • Loading...

More Telugu News