Andhra Pradesh: కాసేపు ఏపీ అసెంబ్లీ సమావేశాల లైవ్ నిలిపివేత ... సిగ్నల్ కట్ చేయించిన స్పీకర్ తమ్మినేని సీతారాం!
- సభలోకి ప్లకార్డులతో ప్రవేశించబోయిన టీడీపీ ఎమ్మెల్యేలు
- అడ్డుకున్న మార్షల్స్ తో గొడవ
- లైవ్ ప్రసారాలను నిలిపివేయించిన స్పీకర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల మూడవ రోజున ప్రత్యక్ష ప్రసారాల సిగ్నల్ ను స్పీకర్ తమ్మినేని సీతారాం కట్ చేయించారు. దీంతో లైవ్ ఆగిపోయింది. అంతకుముందు అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ప్లకార్డులు పట్టుకుని సభలోకి వచ్చేందుకు ప్రయత్నించగా, స్పీకర్ ఆదేశాలతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా సభలో తీవ్ర దుమారం చెలరేగింది. మార్షల్స్ తో టీడీపీ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. ఓ దశలో తమను అడ్డుకుంటున్న మార్షల్స్ ను ఎవరో 'కబడ్దార్' అని హెచ్చరించినట్టు వినిపించింది. దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన స్పీకర్, ప్రత్యక్ష ప్రసారాలను తాత్కాలికంగా నిలిపివేయించారు. ఆ తరువాత 9.45 గంటల సమయంలో లైవ్ ను తిరిగి కొనసాగించాలని స్పీకర్ ఆదేశించారు.