Chandrababu: నల్ల బ్యాడ్జీలతో చంద్రబాబు, బాలకృష్ణ నిరసన... పల్లె వెలుగు బస్సులో అక్కడికి చేరుకున్న లోకేశ్!

  • ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసన
  • సచివాలయం వద్ద టీడీపీ ధర్నా
  • మంగళగిరి నుంచి లోకేశ్ బస్సు ప్రయాణం

పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, వెలగపూడి సచివాలయం సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు ఈ ఉదయం నిరసనకు దిగడంతో, ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తదితరులు నల్ల బ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు.

ఆ సమయంలో మంగళగిరిలో నిరసన తెలిపిన నారా లోకేశ్, ఇతర పార్టీ నేతలతో కలిసి పల్లె వెలుగు బస్సెక్కి సచివాలయం వరకూ వచ్చారు. లోకేశ్ తో పాటు దీపక్ రెడ్డి, అశోక్ బాబులు కూడా అదే బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులోని ప్రయాణికులతో మాట్లాడిన లోకేశ్, పెంచిన చార్జీలు సామాన్యులపై చూపించే ప్రభావాన్ని అడిగి తెలుసుకున్నారు. వెంటనే చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు ధర్నా చేస్తుండటంతో, సచివాలయం ప్రాంతంలో పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

Chandrababu
Nara Lokesh
Amaravati
Secreteriate
Protest
APSRTC
Charges
Hike
  • Loading...

More Telugu News