Kajal Agarwal: వేళ్లతో లవ్ సింబల్ చూపిస్తూ ఫొటో పోస్ట్ చేసిన కాజల్... ప్రేమలో పడిందంటున్న నెటిజన్లు!

  • ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫొటో
  • ప్రస్తుతం 'ఇండియన్-2'లో నటిస్తున్న కాజల్
  • పూర్తి కాగానే పెళ్లి చేసుకునే అవకాశాలు!

దక్షిణాది అందాల నటి కాజల్ అగర్వాల్ ఇప్పుడు ప్రేమలో పడిందని, ఆమెకు పెళ్లి కళ వచ్చేసిందని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. తాజాగా, సముద్రపు ఒడ్డున నిలబడి తన రెండు చేతులనూ కలుపుతూ, లవ్ సింబల్ ను కాజల్ చూపించగా, ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం కమల్ హాసన్ సరసన 'ఇండియన్-2' చిత్రంలో నటిస్తున్న ఆమె, ఆ సినిమా పూర్తి కాగానే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజల్, తనకు ఇంట్లో పెద్దలు సంబంధాలు చూస్తున్నారని చెప్పింది. ఎటువంటి భర్త కావాలన్న విషయంలో చాలా పెద్ద లిస్ట్ నే తయారు చేసుకుని పెట్టుకున్న ఆమె, ఓ వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో ఉందన్న వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో వాటిని ఖండించిన ఆమె, ఇప్పుడు తాజాగా పెట్టిన ఫోటో వైరల్ అవుతుండటంపై మాత్రం ఇంకా స్పందించలేదు.





View this post on Instagram









#Decembervibes ?

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on


Kajal Agarwal
Instagram
Photo
Love Symblo
  • Loading...

More Telugu News