Shriya Saran: నిషిద్ధ ప్రాంతంలో ప్రవేశించిన శ్రియ... తుపాకీ ఎక్కుపెట్టిన లండన్ పోలీసులు!

  • సందకారి చిత్రంలో నటిస్తున్న శ్రియ
  • లండన్ లో షూటింగ్
  • పొరబాటున హై సెక్యూరిటీ జోన్ లో అడుగుపెట్టిన శ్రియ

ప్రౌఢ సుందరి శ్రియా అంటే ఇప్పటికీ అభిమానుల్లో క్రేజ్ తగ్గలేదు. వయసు పెరిగినా అమ్మడి అందం ఇనుమడిస్తోందే తప్ప తగ్గడం లేదు. తాజాగా ఆమె సందకారి అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతుండగా, శ్రియ విపత్కర పరిస్థితి నుంచి తృటిలో బయటపడింది.

సందకారి సినిమా షూటింగ్ ను లండన్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో చిత్రీకరిస్తుండగా, శ్రియ ఒక్కసారిగా హై సెక్యూరిటీ జోన్ లో ప్రవేశించింది.  వెంటనే అప్రమత్తమైన లండన్ పోలీసులు ఆమెకు తుపాకీ గురిపెట్టారు. అదుపులోకి తీసుకుని ప్రశ్నల వర్షం కురిపిస్తుండడంతో శ్రియ షాక్ కు గురైంది. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు తగిన అనుమతి పత్రాలు చూపించడంతో లండన్ పోలీసులు శాంతించారు. అప్పటికే హడలిపోయిన శ్రియ బతుకుజీవుడా అంటూ అక్కడ్నించి ఇవతలికి వచ్చేసిందట!

Shriya Saran
Tollywood
Sandakari
London
Police
  • Loading...

More Telugu News