Raghunandan Rao: దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయి: బీజేపీ నేత రఘునందన్ రావు

  • దిశ నిందితుల ఎన్ కౌంటర్
  •  కేసీఆర్ కు హ్యాట్సాఫ్ చెప్పిన సీఎం జగన్
  • స్పందించిన బీజేపీ నేత

దిశ నిందితుల ఎన్ కౌంటర్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేట్టు కనిపించడంలేదు. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు స్పందించారు. ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరణించిన నిందితుల్లో ఇద్దరు మైనర్లేనని ప్రచారం జరుగుతోందని, వారి టెన్త్ క్లాస్ మెమోలోని పుట్టినతేదీ ప్రకారం వారు మైనర్లో కాదో గుర్తిస్తారని పేర్కొన్నారు. ఒకవేళ వారిద్దరూ మైనర్లే అని తేలితే తెలంగాణ పోలీసులకు తిప్పలు తప్పవని అన్నారు.

అంతేకాకుండా, అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన తొందరపాటు వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ మెడకు చుట్టుకునే ముప్పు ఉందని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్పడం తెలిసిందే.

Raghunandan Rao
BJP
Disha
Jagan
KCR
CBI
  • Loading...

More Telugu News