Congress MLC Jeevan Reddy comments on Dish convicted persons Encounter: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం మూలంగానే మహిళలపై అఘాయిత్యాలు: టీ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

  • నిందితుల దుర్మార్గాలకు ఎన్ కౌంటర్ లు పరిష్కారం కావు
  • ఏపీ సీఎం జగన్ కు ఇక్కడ జరిగేది తెలియదు కాబట్టే హ్యాట్సాఫ్ అన్నారు
  • ఇక్కడ మద్యం వరదలై పారుతోంది.. దానికి కూడా హ్యాట్సాఫ్ అంటారా ?

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి నేరాల్లో నిందితుల దుర్మార్గాలకు ఎన్ కౌంటర్ లు పరిష్కారం కావన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దిశ ఘటన చోటుచేసుకుందన్నారు. వారి తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఎన్ కౌంటర్ చేశారని పేర్కొన్నారు. దిశ ఉదంతంపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

తన జీవితంలో ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్ చూడలేదన్న జీవన్ రెడ్డి, ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు తిరుగుతున్నంతసేపూ వారికి ఎస్కార్ట్ ఇస్తున్నారని చెప్పారు. ఏపీ సీఎం జగన్ కు ఇక్కడ ఏం జరుగుతోందో తెలియదు కాబట్టే హ్యాట్సాఫ్ అన్నారని, తెలంగాణలో మద్యం వరదలపై పారుతోందనే, మరి దానికి కూడా హ్యాట్సాఫ్ అంటారా? అని ప్రశ్నించారు. ఏపీలో ఆంగ్ల విద్య, ఇక్కడ తెలుగు విద్య దానిపై ఏమంటారో చెప్పాలన్నారు. ఆర్థిక మాంద్యం ఉంటే మద్యం అమ్మకాలపై ఆదాయం ఎందుకు పెరుగుతుందో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Congress MLC Jeevan Reddy comments on Dish convicted persons Encounter
Telangana
  • Loading...

More Telugu News