petition against Disha convicted persons Encounter: దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో పౌర హక్కుల సంఘం పిటిషన్

  • సమగ్ర విచారణ జరిపించాలి
  • 9 మందిని ప్రతివాదులుగా చేర్చిన పిటిషనర్
  • ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలి

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ పిటిషన్ వేశారు. తన పిటిషన్లో 9 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ జాబితాలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, సీపీ సజ్జనార్, మహేష్ భగవత్ కూడా ఉన్నారు. ఈ ఎన్ కౌంటర్ బూటకమని తన పిటిషన్లో లక్ష్మణ్  పేర్కొన్నారు.

దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోర్టును కోరారు. ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక, నిందితుల మృతదేహాలను వెంటనే కుటుంబ సభ్యులకు అప్పగించాలని పిటిషనర్ కోరారు. ఇదిలా ఉండగా, ఈ ఎన్ కౌంటర్ పై దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణను  హైకోర్టు గురువారం చేపట్టనుంది.

petition against Disha convicted persons Encounter
In Hyderabad High court
  • Loading...

More Telugu News