Father killed her daughter: ప్రేమించిందన్న కారణంతో కూతుర్ని ముక్కలుగా నరికిన కసాయి తండ్రి

  • మృతదేహాన్ని ముక్కలుగా కోసి బ్యాగ్ లో పెట్టి పారేసిన తండ్రి
  • బ్యాగ్ పారవేసే క్రమంలో దుర్వాసన రావడంతో ఆటో డ్రైవర్ ఆరా
  • అనుమానంతో పోలీసులకు సమాచారమందించిన డ్రైవర్

ప్రేమించిందన్న కారణంతో కన్న కూతురునే కడతేర్చిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కూతురును చంపి ముక్కలుగా కోసి నగరం బయట పారవేసే క్రమంలో పోలీసులకు దొరికిపోయాడా కసాయి తండ్రి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. థాణే జిల్లాలోని తిత్వాలా ప్రాంతంలో నివసించే అరవింద్ తివారీ కూతురు 22 ఏళ్ల ప్రిన్సీ ఓ యువకుడిని ప్రేమించింది.

ఇది నచ్చని తివారీ గత ఆదివారం ప్రిన్సీని చంపి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోసి బ్యాగ్ లో పెట్టి ఓ ఆటోలో తీసుకుపోయి నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. బ్యాగ్ నుంచి దుర్వాసన రావడంతో అందులో ఏముందని ఆటో డ్రైవర్ ప్రశ్నించడంతో అరవింద్ అక్కడినుంచి పారిపోయాడు. అనుమానంతో ఆటో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి బ్యాగ్ తెరిచి మహిళ మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తు చేపట్టి అరవింద్ ను అరెస్టు చేశారు.

Father killed her daughter
Due to her love Affair with a person
  • Loading...

More Telugu News