MLA jaggareddy: వివాదరహిత నేతలే పీసీసీ చీఫ్ అవుతారు: జగ్గారెడ్డి

  • జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులే వివాదారహితులు
  • పార్టీకి ఎన్నికోట్ల రూపాయలిచ్చినా అధిష్ఠానం పదవి ఇవ్వదు
  • వ్యక్తిగతంగా ఎవరు ఎదిగినా అది పార్టీకి మేలుచేస్తుంది

వివాదరహిత రికార్డున్న నాయకులే  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) చీఫ్ గా ఎన్నికవుతారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. త్వరలో పీసీసీ చీఫ్ గా కొత్త వ్యక్తిని ఎంపిక చేస్తారన్న నేపథ్యంలో జగ్గారెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులే వివాదరహితులన్నారు. వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చుపెడతామన్నప్పటికీ అధిష్ఠానం పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వదని చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరు ఎదిగినా అది పార్టీకి మేలుచేస్తుందని అభిప్రాయపడ్డారు. 2018లో డబ్బులు తీసుకొని ఓట్లువేశామన్న భావనలో ప్రజలున్నారన్నారు. 2023లో డబ్బులు ఇవ్వకపోయినా వారు కాంగ్రెస్ కే ఓట్లు వేస్తారన్నారు.

MLA jaggareddy
PCC Chief election
comments
  • Loading...

More Telugu News