Gajendra Singh Shekhawat: కొన్ని రాష్ట్రాల్లో తలపెట్టిన ప్రాజెక్టులకు భూసమీకరణ సమస్య ఉంది: కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్

  • రాజ్యసభలో బదులిచ్చిన కేంద్రమంత్రి
  • ఐదేళ్లుగా సాగు, తాగునీరు అందిస్తున్నామని వెల్లడి
  • భూసమీకరణ చేయడం రాష్ట్రాల పని అని స్పష్టీకరణ

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. రాష్ట్రాల్లో గత ఐదేళ్లుగా తాగు, సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. రాష్ట్రాల్లో వివిధ పేర్లతో సాగునీటి పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులకు కేంద్రం నిధులు అందిస్తోందని వెల్లడించారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో తలపెట్టిన ప్రాజెక్టులకు భూసమీకరణ సమస్య ఉందని కేంద్రమంత్రి చెప్పారు. ప్రాజెక్టులకు భూసమీకరణ చేయడం అనేది రాష్ట్రాలకు సంబంధించిన పని అని స్పష్టం చేశారు.

Gajendra Singh Shekhawat
Rajya Sabha
States
Projects
  • Loading...

More Telugu News