Telugudesam: టీడీపీ హయాంలో రైతుది చేయి జాపి అడుక్కునే పరిస్థితి: కాకాణి గోవర్ధన్ రెడ్డి

  • మా ప్రభుత్వం వచ్చాక రైతులు సంతోషంగా ఉన్నారు
  • ‘వైఎస్సార్ భరోసా’ వంటి పథకం మునుపెన్నడూ లేదు
  • జగన్ నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నారు

టీడీపీ హయాంలో రైతు చేయి జాపి అడుక్కునే పరిస్థితి ఉండేదని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు సంతోషంగా వున్నారని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈరోజున చంద్రబాబు ఏది మాట్లాడినా నీటి మీద రాతలే అని, జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా సరే రాతి మీద చెక్కిన శాసనాలు అని ప్రజలు గుర్తించారని, అందుకే, జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి తీసుకురానటువంటి పథకం ఇదని అన్నారు. ఇలాంటి పథకం అందించిన సీఎం జగన్ నిండు నూరేళ్లు ఉండాలని, శాశ్వత ముఖ్యమంత్రిగా ఏపీని పరిపాలించాలని కోరుకుంటున్నారని అన్నారు.

Telugudesam
Chandrababu
YSRCP
kakani
  • Loading...

More Telugu News