Hyderabad: ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన మన్సురాబాద్ కాలనీ వాసులు.. ఉద్రిక్తత

  • రెండు పడక గదుల ఇళ్లు కేటాయించాలని డిమాండ్ 
  • తమకు కేటాయించకుండా స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపణ
  • ఆందోళనకారుల అరెస్టు  

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముట్టడికి హైదరాబాద్ లోని మన్సురాబాద్ కాలనీ వాసులు ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. రెండు పడక గదుల ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వారు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన  రెండు పడక గదుల ఇళ్లను తమకు కేటాయించకుండా పలువురు స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారని మన్సురాబాద్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి 150 కుటుంబాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు నినాదాలు చేశారు.

Hyderabad
Police
  • Loading...

More Telugu News