Uttar Pradesh: యూపీ సర్కారు కీలక నిర్ణయం.. అత్యాచార, పోక్సో కేసుల సత్వర పరిష్కారానికి 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు!
- 144 కోర్టులు అత్యాచారాల కేసులకు
- 74 కోర్టులు చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల పరిష్కారానికి
- ఒక్కో కోర్టు ఏర్పాటుకు రూ. 75 లక్షల ఖర్చు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యాచారం కేసుల సత్వర పరిష్కారానికి 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు యూపీ మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో 144 కోర్టులు అత్యాచారాల కేసుల పరిష్కారానికి, మిగిలిన 74 కోర్టులు చిన్నారులపై వేధింపులకు సంబంధించి పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల విచారణకు పనిచేయనున్నట్టు యూపీ న్యాయశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు. ఒక్కో కోర్టుకు రూ.75 లక్షలు వెచ్చించనున్నట్టు పేర్కొన్నారు.
అయోధ్య, గోరఖ్పూర్, ఫిరోజాబాద్నగర్ నిగంతోపాటు 41 గ్రామాలను విలీనంతోపాటు గౌతంబుద్ధనగర్ జిల్లాలోని జేవర్ ప్రాంతంలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదించింది.