saudi arabia: సౌదీ నుంచి కేరళ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం.. దారి మళ్లింపు

  • కోజికోడ్ వస్తున్న విమానం
  • టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం
  • అత్యవసరంగా మస్కట్‌కు దారి మళ్లింపు

సౌదీలోని జెడ్డా నుంచి కేరళలోని కోజికోడ్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం ఎస్‌జీ 36లో సాంకేతిక లోపం ఏర్పడడంతో దానిని దారి మళ్లించారు. జెడ్డా విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ ఏటీసీకి సమాచారం అందించాడు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో విమానాన్ని అత్యవసరంగా మస్కట్‌కు మళ్లించారు. జెడ్డా నుంచి కేరళకు 4,088 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి ఉండడంతో విమానాన్ని దారి మళ్లించాల్సి వచ్చిందని స్పైస్‌జెట్ అధికారులు తెలిపారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

saudi arabia
spice jet
kozhikode
  • Loading...

More Telugu News