Gokaraju Gangaraju: మా అన్న గంగరాజు ఏ పార్టీలోనూ చేరనన్నారు: గోకరాజు నరసింహరాజు

  • వైసీపీలో చేరిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబసభ్యులు
  • వైసీపీ తీర్థం పుచ్చుకున్న గోకరాజు రంగరాజు, రామరాజు, నరసింహరాజు
  • గంగరాజు మద్దతు ఎప్పుడూ ఉంటుందన్న నరసింహరాజు
  • తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు గంగరాజు వెల్లడి

బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.  గంగరాజు సోదరులు రామరాజు, నరసింహరాజు కూడా వైసీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా గోకరాజు నరసింహ రాజు మాట్లాడుతూ, తన సోదరుడు గంగరాజు ఏ పార్టీలోనూ చేరనన్నారని వెల్లడించారు. అన్నయ్య గంగరాజు మద్దతు తమకెప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. వైఎస్సార్ అంటే తమకు అమితమైన అభిమానమని ఆయన వెల్లడించారు.

ఇక గోకరాజు రామరాజు మాట్లాడుతూ, జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. జగన్ కుటుంబంతో తమకు అవినాభావ సంబంధం ఉందని అన్నారు. అంతకుముందు, తన కుటుంబ సభ్యులు వైసీపీలో చేరుతుండడం పట్ల గోకరాజు గంగరాజు స్పందిస్తూ, తాను కూడా వైసీపీలోకి వెళుతున్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోందని, అందులో నిజం లేదని స్పష్టం చేశారు. తాను కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని వెల్లడించారు. తాను ఏ పార్టీకి దగ్గరగా లేనని వివరించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News