Disha: దిశ నిందితుల మృతదేహాల తరలింపునకు ఏర్పాట్లు... మెడికల్ కాలేజి వద్ద భారీ భద్రత

  • మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో నిందితుల మృతదేహాలు
  • గాంధీ ఆసుపత్రికి తరలించాలన్న హైకోర్టు
  • మృతదేహాలను అర్ధరాత్రి తరలించే అవకాశం

ఎన్ కౌంటర్ లో మరణించిన దిశ నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రిలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నలుగురు నిందితుల మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మృతదేహాల తరలింపు సందర్భంగా మహబూబ్ నగర్ మెడికల్ కాలేజి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి కిత్రమే ఏసీ అంబులెన్స్ లు మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నాయి.

కాగా, నిందితుల మృతదేహాలను భద్రపరిచేందుకు గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రి సిబ్బంది ఫ్రీజర్ బాక్సులను సిద్ధం చేశారు.  అయితే భద్రతా కారణాల రీత్యా మృతదేహాలను అర్ధరాత్రి తరలించనున్నట్టు తెలుస్తోంది.

Disha
Hyderabad
Telangana
Gandhi Hospital
Mahabubnagar
  • Loading...

More Telugu News