YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన గోకరాజు రంగరాజు!

  • మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజు  
  • గంగరాజు సోదరులు సైతం వైసీపీలోకే!
  • తనపై అసత్య ప్రచారం అంటూ గంగరాజు అసహనం

ఎన్నికల తర్వాత కొన్నినెలల వరకు ఇతరులకు ప్రవేశం నిరాకరించిన వైసీపీ ఇప్పుడు ద్వారాలు తెరిచింది! పార్టీలోకి వలసలను ఆహ్వానిస్తున్నారు. తాజాగా, ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు రంగరాజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో కండువా కప్పుకున్నారు. రంగరాజు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు. రంగరాజు మాత్రమే కాకుండా గంగరాజు సోదరులు రామరాజు, నరసింహరాజు కూడా జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గోకరాజు కుటుంబసభ్యులను జగన్ వైసీపీలోకి సాదరంగా స్వాగతించారు.

అంతకుముందు గోకరాజు గంగరాజు సైతం వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందించారు. వైసీపీలో చేరుతోంది తన కుమారుడు రంగరాజు, తన సోదరులు మాత్రమేనని వెల్లడించారు. తన వివరణ తీసుకోకుండా పార్టీ మారుతున్నానంటూ ఏకపక్షంగా ప్రచారం చేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.

YSRCP
Gokaraju Rangaraju
Gangaraju
Andhra Pradesh
BJP
  • Loading...

More Telugu News