Karnataka: కర్ణాటక పీసీసీ చీఫ్ పదవికి గుండూరావు రాజీనామా

  • ఇప్పటికే రాజీనామా చేసిన సీఎల్పీ నేత సిద్ధరామయ్య
  • ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ..పదవుల త్యాగం
  • 15 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 2 స్థానాల్లో మాత్రమే గెలిచిన కాంగ్రెస్

కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. ఆ పార్టీ రాష్ట్ర నేతలు రాజీనామాల బాట పట్టారు. రాష్ట్ర పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు దినేష్ గుండూరావు ప్రకటించారు. పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎల్పీ నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

తాజాగా గుండూరావు కూడా ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ.. రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు పంపించినట్లు వెల్లడించారు. ఈ రోజు ప్రకటించిన ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు కేవలం 2 స్థానాలు మాత్రమే దక్కాయి. మొత్తం 15 స్థానాలకు ఎన్నికలు జరుగగా బీజేపీ 12 స్థానాలు గెలిచింది. ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి కైవసం చేసుకున్నాడు.

Karnataka
by polls
assembly
Congress pcc chief Gundu Rao and clp leader Sidda Ramaiah Resigned
  • Loading...

More Telugu News