Sidharamaiah: సీఎల్పీ పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య
- ఉప ఎన్నికల్లో 12 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ
- రెండు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్
- ఓటమికి బాధ్యత వహిస్తున్నానన్న సిద్ధరామయ్య
కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా... ఏకంగా 12 స్థానాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత (సీఎల్సీ) పదవికి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రజా తీర్పును కాంగ్రెస్ పక్ష నేతగా తాను గౌరవించాలని చెప్పారు. సీఎల్పీ పదవికి రాజీనామా చేశానని... రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించానని తెలిపారు.