Disha: దిశ నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకు భద్రపరచాలన్న హైకోర్టు

  • ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ
  • సుప్రీం కోర్టు మార్గదర్శకాలపై సర్కారును ప్రశ్నించిన హైకోర్టు
  • తదుపరి విచారణ ఈ నెల 12కి వాయిదా

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ ఘటనలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించారా? అని సర్కారును హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఒకవేళ పాటించినట్టయితే అందుకు తగిన ఆధారాలు చూపించండి అంటూ అడిగింది. ఈ మేరకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ను న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో ఉన్న నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి శుక్రవారం వరకు భద్రపరచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Disha
Telangana
Hyderabad
mahabub Nagar
Gandhi Hospital
High Court
  • Loading...

More Telugu News