Ranchi: రాంచీలో భద్రతా బలగాల కమాండర్ ను కాల్చి చంపిన కానిస్టేబుల్

  • జార్ఖండ్ లో మరోసారి కాల్పుల కలకలం
  • కమాండర్ రామ్ ఖురేపై కాల్పులు జరిపిన కానిస్టేబుల్ విక్రమ్
  • ఎన్నికల విధుల కోసం వెళ్లిన ఛత్తీస్ గఢ్ బలగాల బృందంలో కాల్పులు

జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ సందర్భంగా గుమ్లా జిల్లాలోని సిసాయి నియోజకవర్గంలో జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే మరోసారి అదే రాష్ట్రంలో కాల్పుల కలకలం చెలరేగింది. ఈ రోజు ఉదయం రాంచీలో భద్రతా బలగాల కమాండర్ ను ఓ కానిస్టేబుల్ కాల్చి చంపాడు.

దీనిపై అధికారులు మాట్లాడుతూ... కమాండర్ రామ్ ఖురేపై కాల్పులు జరిపిన కానిస్టేబుల్ పేరు విక్రమ్ రాజ్వారే అని చెప్పారు. ఎన్నికల విధుల కోసం జార్ఖండ్ వెళ్లిన ఛత్తీస్ గఢ్ బలగాల బృందంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుందని వివరించారు. విక్రమ్ ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Ranchi
jharkhand
Police
  • Loading...

More Telugu News