karimnagar: రష్యా అమ్మాయిని పెళ్లాడిన కరీంనగర్ అబ్బాయి!
- ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన సందీప్
- సహ విద్యార్థిని వెరోనికతో ప్రేమ
- పెద్దలను ఒప్పించి వివాహం
కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడు రష్యాకు చెందిన యువతిని పెళ్లాడాడు. కరీంనగర్ శివారులో నిన్న జరిగిన ఈ వివాహం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. పట్టణానికి చెందిన సందీప్ కుమార్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ తన కాలేజీలోనే చదువుకుంటున్న రష్యాకు చెందిన వెరోనికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఇద్దరు ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపారు. వారు కూడా అంగీకరించడంతో ఆదివారం వీరి వివాహం ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహానికి వధువు తరపున వెరోనిక తల్లి హాజరైంది. ఘనంగా జరిగిన ఈ వివాహానికి పలువురు పెద్దలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.